అమ్మా బాబులు ఎవరో తెలియదు
అక్కచెల్లెళ్ళు అసలే లేరు
ఆలి వంక బందువుల ఆసరా లేదు
ఈ తిక్కేంటి రా నీకు ముక్కంటి.?!
కమలాసనుడు ఒకరు
కడలి పైన కమలనాభుడు ఒకరు
ఖర్మ కాకుంటే కాటి భతుకు నీకేంటి?
ఈ తిక్కేంటి నీకు.. .
సడువులున్న గీర్వాణి సతి ఒకరికి
సకలసంపదల రాణి సతి ఒకరికి.
ఏ అండ లేని బండోడి కూతురు నీకు సతి ఏమిటి.?!
ఈ తిక్కేంటి. . .
పసిడి నగలు మాని పాములేల.?
పట్టుబట్టలు కాక పులిచర్మలేమిటి.?
పునుగు జవ్వాది కాక బూడిదళు ఎందుకురా?
ఈ తిక్కేంటి రా నీకు . .
హంస ఎక్కి తిరుగు ఆ ముసలి బ్రహ్మ
గరుడ వాహనము గడుసరి విష్ణువుకి
కదలక మొరాయించే ఈ ఎనుపోతు నీకేల.?
ఈ తిక్కేంటి రా.. ..
చిలికి సంద్రాన్ని సురాసురులు
సిరిని హరికి ఇచ్చి సుధను అందరు పొందే
గతి లేని వాడిలా ఈ గరలమెందుకు రా నీకు
ఈ తిక్కేంటి రా. .
తనకు తోచిన రాతలు ఒకరు రాస్తారు
తాలుకు బెళుకుల భతుకు ఒకరు ఇస్తే
తలయారిలాగా ప్రాణాలు తీసే గతి నీకేంటి?
ఈ తిక్కేంటి రా .
మనసుపడిన తల్లి తన నలుగుతో
నలుసుగా ఒక శిశువు చేసుకుంటే
మనసెరగని వాడిలా ఉసురు తీస్తివి నీవు ?
ఈ తిక్కేంటి రా .
సురలు, ఋషులు కిన్నెర
కింపురుషులు, సకలదేవతలు కంటే
ఇంపుగా ఉంటిర ఈ బూత ప్రేతములు?
ఈ తిక్కేంటి..
క్షీనా చంద్రుడు నీకు సిగపువ్వా?
నీరుకారే కురులు నీలామ్బరాలు
సగముపగిలిన పుర్రె నీకు భక్ష్య పాత్రలా.?
ఈ తిక్కేంటి రా నీకు ముక్కంటి?!
ఈ తిక్కేంటి రా నీకు ముక్కంటి?!