Thursday, 5 April 2012
Tuesday, 6 September 2011
శ్రీ శ్రీచక్ర పీఠం ***శ్రీ శివశక్తి జ్యోతిషాలయం
49 -15 -6 , లలితా నగర్ , అక్కయ్య పాలెం , విశాఖపట్నం 16
ఫోన్ :9848389972 ,.,.9757473042 .,.,. 0891 -౩౦౯౮౩౦౮
శ్రీ శ్రీ శ్రీ శరన్నవరాత్రి ఉత్సవములకు మీకు మా ఆహ్వానము
నమస్కారములు,
మీరు అమ్మ వారి మీద వున్నా అచంచలమైన నమ్మకముతో మా పీటము నందు అమ్మ వారి పూజలు
చేసుకుని అమ్మ కృపకు , కరుణకు పాత్రులై సుఖ సంతోషములతో వున్నందుకు,మాకు ఈ అవకాశము
ఇట్చినందుకు మా కృతజ్ఞ్యతలు .ఈ నెలలో అమ్మ వారి "శరన్నవరాత్రి ఉత్సవములు " ఆరంభము కానున్నాయి,
ఈ పర్వదినముల్లో మన పీటము లో జరుగు పూజలలో పాల్గొని అమ్మ వారి కృపతో మీరు మీ కుటుంభ
సబ్యులు ఆయురారోగ్యములతో సుఖసంతోషములతో వుండాలని మా కోరిక కనుక స్వయముగా గాని మా ద్వార గాని ఈ పూజలలో పాల్గొనవలసినదిగా మరియు అమ్మ కృప పొందాలని మా మనవి
సర్వం శ్రీ జగదాంబ చరనారవిన్దార్పనమస్తూ
అమ్మ ఆశీస్సులతో
మీ
శివానంద శాస్త్రి
Sunday, 7 August 2011
రక్షా బందనమ రక్త బంధమా ?
రఖా బందన
ప్రతి అక్కాచెల్లెలు తన సోదరునికి ప్రేమతో చేతికి కట్టే బంధనం
నిజానికి ఇది బందనమా బందమా
సోదరుడికి సోదరే ఎందుకు కట్టాలి?.
అన్నకి తమ్ముడు ఎందుకు కట్ట రాదు ?
అసలు అన్నదమ్ములు అక్కచేల్లెల్లుకు ఇచ్చే రక్షణ ఏమిటి
ఉన్నవాడికి లేనివారు కట్టే బందనమ ?నిజముగా రక్షణ కోరే బందనమా ?
ఉన్నవాడి చేతికి లేని వారు కట్టేదా, ఉనావాడికి ఉన్నవారు కట్టేదా ?లేనివారికి వున్నవారు కట్టేదా ?
అసలు ఉండ వలసినది ఏమిటి?
లేనితనము ఏమిటి?
వుండనలసినవి ప్రేమ అభిమానములు !
లేవు అని బాధపడేది సంతోషము ,దైర్యము,
నిజానికి మనము బ్రతికినంత వరకు ఆ భరోసా ఇస్తామా ?ఇస్తున్నామ?
మన స్థితి మారి మనము గోప్పవారిమైతే మనకు పెళ్లి , ఒక కుటుంబము ఏర్పడితే
అప్పుడు కూడా మనము మన తోడ బుట్టిన వారితో అలానే ఉండగలమా?
మన మనసు లోతులలో ఎప్పుడు ఆ ప్రేమ అలానే చిగురిస్తూ వుంటుందా?
అయిన రక్షా బంధనము అంటే అది సహోదరులకు కల్పించేది అనే దాని కన్నా
మన అమ్మకు మనము ఇవ్వలిసిని రఖ్షణ అది ,
మనకు తొలిఆకలి తన రొమ్ము పాలతో తీర్చిన అన్నపూర్ణ
తొలిపలుకులు నేర్పిన గురువు
తొలి అడుగులు నేర్పిన మార్గదర్శి
తొలి సారిగా ఈ లోకాన్ని చూపిన స్నేహితు రాలు
మన తనవులోఅనువనువు తన రక్త మామసములతో నింపిన అపూర్వ త్యాగ మూర్తి
ఏమిచ్చి ఆమె ఋణము మనము తీర్చుకో గలము ,ఎందుకంట్ మనలోని సర్వస్వం ఆమె కరుణే
అందుకే మనం బతికి ఉన్నంత వరకు అమ్మ కంట కన్నీరు రాకుండా,
అమ్మ మనసు కలత చెందకుండా
అమ్మ బ్రతుకు అనాధ కాకుండా
కాపాడుకుంటామని
మన సంస్కారము మీద మన మానవత్వము మీద ప్రమాణము చేసి
కట్టాలి రక్షా బంధనము .!
తల్లి అయిన అక్క చెల్లి అయిన మనలో వారి మీద మనకు ఉండాల్సిన భాద్యత ఇది
ఈ తిక్కేంటి రా నీకు ముక్కంటి. . ?
12 .భతుకు కోరే భావమరుదులు లేరు
వెతలు తీర్చగా నా అన్న వారు లేరు
హితులు, పరపతులు లేని ఏకాకివి
ఈ తిక్కేంటి రా
13 .బందుజనమా? మంది మార్బలమా
లంకంత మేడలా చిన్తేరుగని సిరులా
ఎంతకాదన్న ఏ మామ మాత్రము విలువిచ్చు ఈ లోకాన?
ఈ తిక్కేంటి రా.
13 .ఒగ్గువైతివని నీ మదిలూ మరుల
అగ్గి రేపగా ఆ మరుడినే
సిగ్గు సిగ్గు బుగ్గి పాలు చేస్తివి
ఈ తిక్కేంటి రా నీకు. .
14 .నందివర్ధనాలు,నిద్రగన్నేరులు
జిల్లేడు,మారేడు,ఉమ్మెత్త పూలు
పల్లేరు కాయలే నీకు ప్రియమైనవా?.
ఈ తిక్కేంటి రా
15 నాల్గుముఖముల నాధుడు ఒకరు
వేయిముఖముల వేల్పులు ఒకరు
అండాకార నీకెన్ని ముఖములు రా ఈశానా.?
ఈ తిక్కేంటి రా. .
16 .నీలోని సగమంటూ ఆమెపక్షమై వామపక్షమిస్తివి
దక్షినమే ఇస్తే దాక్షాయానికి
లక్షణముగా నీ మనసు మాకు దక్కేది రా
ఈ తిక్కేంటి రా ?.
17 .నుదుట నిప్పుకన్ను,మెడలో విష నాగులు
కంపు పులితోలు బట్టలు ఒళ్ళంతా బూడిద
పట్టాడ, తట్టదా అమ్మ ముద్దు ముచ్చట నీకు
ఈ తిక్కేంటి రా .?
18 నీది వృషభము,అమెదేమో సిన్ఘము
పిల్లలవి ఎలుక,నెమలి పాము కుక్కోట ములు
ఏమి వింత రా శివ ఇల్లంతా వైరి సంతే .?
ఈ తిక్కేంటి.
19 నీలోన సగమంటూ ఆమె నీ జగమంటూ
తేగాచేప్పుకుంటూ ఒగలు పోతుంటావు
సిగాలోని గంగమ్మ లేక్కేంటి రా జంగమయ్య. ?
ఈ తిక్కేంట్ రా నీకు
20 శివ శివ అంటే శివ మెత్తి పోతావు
ఆలినైనా, అత్మలింగామైన అప్పగించేస్తావు
అసుర రీతి నీవసలు ఎరుగక భోలశంకర .
ఈ తిక్కేంటి రా
21 పుక్కిలిలోని నీటితో అభిషేకములుకన్న
మారేడుఆకులు,పచ్చి మంసములు పెట్టె తిన్నడి కన్నా
పంచభక్ష్యములు నీకు కావా మిన్న
22 మదపుటేనుగు,బుసకొట్టే నాగు
బూజుపట్టే సాలీడు భక్తి
మురిపించేన శివ నీ లేక్కేంటి రా
23 నిర్నిద్రాలే నీకు శివరాత్రి సంభారాలా
కటికపస్తులుంటే నీకు ఆర్తియా కార్తీక
ఏమి పర్వదినములు రా నీకు సద్యోజాత
చీమంతైన లేవు ఏమంత బాధ నీకు
చీమంతైన లేవు ఏమంత బాధ నీకు
కేరింతలాడు వేల ఈ చింత ఏల నీకు
నవ్వర నవ్వర నా తండ్రి
నీ నవ్వులే దివ్వేలురా మా కంట. .
ఆ బాలచంద్రునితో ఆటాడుకుంటూ
శ్రిరమాచంద్రుని కదలే వింటూ
బుంగమూతి బుజ్జాయి బంగారు తండ్రి
పాలభువ్వతో గోరుముద్దలుగా తింటూ
ఆదమరచి అమ్మవడిలో నిదురించక
ఇంతలో నీకెందుకు ఈ అలుక?
నాన్న వడే నీకు అమ్బరీరా
నీ అమ్మ నీకై వేచే కంబారిరా
నాన్నమ్మ కొంగుతో దొంగాటలాడుతూ
తాతయ్య మీసాలతో వుయ్యాలలూగుతుంటే
నీ ఆటపాటలకు సామంతులము
నీ నవ్వులుంటే మేము సీమంతులము
బుడిబుడి నీ అడుగులే బృందావనం
చిట్టిపొట్టి నీ పలుకులే మురళి గానము
చల్లని నీ నవ్వులలో మా వెతలు మరచి
మురిసిపోతూ మేమంతా మైమరచి పోవాలి
ఇంతలోనే అంత దిగులు నీకెందుకు
ఎంత ఏడ్సినా తిరిగి రాణి భాగ్యమురా ఈ బాల్యము
Friday, 5 August 2011
ఈ తిక్కేంటి రానీకు ముక్కంటి?!.
ఈ తిక్కేంటి రా నీకు ముక్కంటి శివ ?!.
11 పాలభిషేకములు పట్టవ గిట్టవ
మున్తనీలకు ,పిసరంత బూడిదకు
సంతసించి మా సొంతమై పోతావు
ఈ తిక్కేంటి రా . .
Thursday, 4 August 2011
ఈ తిక్కేంటి రా నీకు ముక్కంటి?!
అమ్మా బాబులు ఎవరో తెలియదు
అక్కచెల్లెళ్ళు అసలే లేరు
ఆలి వంక బందువుల ఆసరా లేదు
ఈ తిక్కేంటి రా నీకు ముక్కంటి.?!
కమలాసనుడు ఒకరు
కడలి పైన కమలనాభుడు ఒకరు
ఖర్మ కాకుంటే కాటి భతుకు నీకేంటి?
ఈ తిక్కేంటి నీకు.. .
సడువులున్న గీర్వాణి సతి ఒకరికి
సకలసంపదల రాణి సతి ఒకరికి.
ఏ అండ లేని బండోడి కూతురు నీకు సతి ఏమిటి.?!
ఈ తిక్కేంటి. . .
పసిడి నగలు మాని పాములేల.?
పట్టుబట్టలు కాక పులిచర్మలేమిటి.?
పునుగు జవ్వాది కాక బూడిదళు ఎందుకురా?
ఈ తిక్కేంటి రా నీకు . .
హంస ఎక్కి తిరుగు ఆ ముసలి బ్రహ్మ
గరుడ వాహనము గడుసరి విష్ణువుకి
కదలక మొరాయించే ఈ ఎనుపోతు నీకేల.?
ఈ తిక్కేంటి రా.. ..
చిలికి సంద్రాన్ని సురాసురులు
సిరిని హరికి ఇచ్చి సుధను అందరు పొందే
గతి లేని వాడిలా ఈ గరలమెందుకు రా నీకు
ఈ తిక్కేంటి రా. .
తనకు తోచిన రాతలు ఒకరు రాస్తారు
తాలుకు బెళుకుల భతుకు ఒకరు ఇస్తే
తలయారిలాగా ప్రాణాలు తీసే గతి నీకేంటి?
ఈ తిక్కేంటి రా .
మనసుపడిన తల్లి తన నలుగుతో
నలుసుగా ఒక శిశువు చేసుకుంటే
మనసెరగని వాడిలా ఉసురు తీస్తివి నీవు ?
ఈ తిక్కేంటి రా .
సురలు, ఋషులు కిన్నెర
కింపురుషులు, సకలదేవతలు కంటే
ఇంపుగా ఉంటిర ఈ బూత ప్రేతములు?
ఈ తిక్కేంటి..
క్షీనా చంద్రుడు నీకు సిగపువ్వా?
నీరుకారే కురులు నీలామ్బరాలు
సగముపగిలిన పుర్రె నీకు భక్ష్య పాత్రలా.?
ఈ తిక్కేంటి రా నీకు ముక్కంటి?!
ఈ తిక్కేంటి రా నీకు ముక్కంటి?!
Subscribe to:
Posts (Atom)