చీమంతైన లేవు ఏమంత బాధ నీకు
కేరింతలాడు వేల ఈ చింత ఏల నీకు
నవ్వర నవ్వర నా తండ్రి
నీ నవ్వులే దివ్వేలురా మా కంట. .
ఆ బాలచంద్రునితో ఆటాడుకుంటూ
శ్రిరమాచంద్రుని కదలే వింటూ
బుంగమూతి బుజ్జాయి బంగారు తండ్రి
పాలభువ్వతో గోరుముద్దలుగా తింటూ
ఆదమరచి అమ్మవడిలో నిదురించక
ఇంతలో నీకెందుకు ఈ అలుక?
నాన్న వడే నీకు అమ్బరీరా
నీ అమ్మ నీకై వేచే కంబారిరా
నాన్నమ్మ కొంగుతో దొంగాటలాడుతూ
తాతయ్య మీసాలతో వుయ్యాలలూగుతుంటే
నీ ఆటపాటలకు సామంతులము
నీ నవ్వులుంటే మేము సీమంతులము
బుడిబుడి నీ అడుగులే బృందావనం
చిట్టిపొట్టి నీ పలుకులే మురళి గానము
చల్లని నీ నవ్వులలో మా వెతలు మరచి
మురిసిపోతూ మేమంతా మైమరచి పోవాలి
ఇంతలోనే అంత దిగులు నీకెందుకు
ఎంత ఏడ్సినా తిరిగి రాణి భాగ్యమురా ఈ బాల్యము
No comments:
Post a Comment