12 .భతుకు కోరే భావమరుదులు లేరు
వెతలు తీర్చగా నా అన్న వారు లేరు
హితులు, పరపతులు లేని ఏకాకివి
ఈ తిక్కేంటి రా
13 .బందుజనమా? మంది మార్బలమా
లంకంత మేడలా చిన్తేరుగని సిరులా
ఎంతకాదన్న ఏ మామ మాత్రము విలువిచ్చు ఈ లోకాన?
ఈ తిక్కేంటి రా.
13 .ఒగ్గువైతివని నీ మదిలూ మరుల
అగ్గి రేపగా ఆ మరుడినే
సిగ్గు సిగ్గు బుగ్గి పాలు చేస్తివి
ఈ తిక్కేంటి రా నీకు. .
14 .నందివర్ధనాలు,నిద్రగన్నేరులు
జిల్లేడు,మారేడు,ఉమ్మెత్త పూలు
పల్లేరు కాయలే నీకు ప్రియమైనవా?.
ఈ తిక్కేంటి రా
15 నాల్గుముఖముల నాధుడు ఒకరు
వేయిముఖముల వేల్పులు ఒకరు
అండాకార నీకెన్ని ముఖములు రా ఈశానా.?
ఈ తిక్కేంటి రా. .
16 .నీలోని సగమంటూ ఆమెపక్షమై వామపక్షమిస్తివి
దక్షినమే ఇస్తే దాక్షాయానికి
లక్షణముగా నీ మనసు మాకు దక్కేది రా
ఈ తిక్కేంటి రా ?.
17 .నుదుట నిప్పుకన్ను,మెడలో విష నాగులు
కంపు పులితోలు బట్టలు ఒళ్ళంతా బూడిద
పట్టాడ, తట్టదా అమ్మ ముద్దు ముచ్చట నీకు
ఈ తిక్కేంటి రా .?
18 నీది వృషభము,అమెదేమో సిన్ఘము
పిల్లలవి ఎలుక,నెమలి పాము కుక్కోట ములు
ఏమి వింత రా శివ ఇల్లంతా వైరి సంతే .?
ఈ తిక్కేంటి.
19 నీలోన సగమంటూ ఆమె నీ జగమంటూ
తేగాచేప్పుకుంటూ ఒగలు పోతుంటావు
సిగాలోని గంగమ్మ లేక్కేంటి రా జంగమయ్య. ?
ఈ తిక్కేంట్ రా నీకు
20 శివ శివ అంటే శివ మెత్తి పోతావు
ఆలినైనా, అత్మలింగామైన అప్పగించేస్తావు
అసుర రీతి నీవసలు ఎరుగక భోలశంకర .
ఈ తిక్కేంటి రా
21 పుక్కిలిలోని నీటితో అభిషేకములుకన్న
మారేడుఆకులు,పచ్చి మంసములు పెట్టె తిన్నడి కన్నా
పంచభక్ష్యములు నీకు కావా మిన్న
22 మదపుటేనుగు,బుసకొట్టే నాగు
బూజుపట్టే సాలీడు భక్తి
మురిపించేన శివ నీ లేక్కేంటి రా
23 నిర్నిద్రాలే నీకు శివరాత్రి సంభారాలా
కటికపస్తులుంటే నీకు ఆర్తియా కార్తీక
ఏమి పర్వదినములు రా నీకు సద్యోజాత
No comments:
Post a Comment