Thursday, 5 April 2012

నాన్నే అమ్మను చంపాడు

 నాన్నే మా అమ్మను చంపాడు 

జడ్జి గారు మా నాన్నే మా అమ్మను హత్యా చేసాడు...?

కోర్ట్ హలో ఒక్క సారి నిశ్శబ్దం . అందరు  నా వైపే చిత్రంగా, అసయ్యముగా  చూస్తున్నారు 

మల్లి వాడు అదే మాట చాల బాధగా  కోపముగా చెప్పాడు .

ఈ ముసలి వయసులో పెళ్ళాన్ని చంపేంత అవసరము వీడికేమిటని,  కోర్ట్ హాల్లో అందరు గుసగుసలు 

ఏమో ఎవర్తిని మరిగాడో లేకుంటే ఈవయసులో పెళ్ళాన్ని చంపట  మెందుకు ?

పోయే కాలం ... ఎవరిదో జవాబు . ఇంకెవరిదో నవ్వులు..

నిజమే పోయే కాలమే ...సైలెన్సు ప్లీజ్ ...

జడ్జి గారి హుకుం ..

ఏమయ్యా నీ పిల్లలు చెప్పినది విన్నావు కదా ...నీవు చెప్పు కొనేది  ఏదైనా వుందా 

నిశ్శబ్దం ...గుండె చప్పుడు వినపడేంత నిశ్శబ్దం 

అతడు ఏమి చెప్తాడు మిలార్డ్ ..చేసిన నిర్వాకము అతడి కొడులులే చెప్పారు ఇంకా ముద్దాయి చెప్ప్పు కోడానికి ఏమి వుంటుంది. సాక్ష్యాలు పరిశీలించి  ముద్దాయికి కటిన శిఖ్ష . కాదు .కాదు వురి శిక్ష విదించాలి.

ఇందువల్ల నైనా బవిష్యత్హులో మరి ఏ మగాడు ఇలాంటి నేరము చేయకుండ్ గునపాటముగావుండాలి .

పి.పి. వుద్వేగముగా చెప్తూ నన్నో మృగముల చూస్తూ కూర్చున్నారు 

టిక్ . .టిక్...గోడ గడియారములో చప్పుడు ..

ఏమయ్యా ఆకరుసారి అడుగు తున్న్న నీవు  చెప్పుకునేది ఏమైనా వుందా ? లేక పి.పి గారి వాదనలు బట్టి 

నీకు శిక్ష  విదించ వలసి వుంటుంది .జడ్జి నా వంక అదోల (?) చూస్త్గు చెప్పారు 

వుంది సార్.. గట్టిగా అన్నానో లేక అది నా గొంతులోంచి పైకి రానంత కీచుగా అన్నానో నాకే అర్దము కాలేదు. నా గొంతు దుక్కముతో పూడుకు పోయి వుంది .

రంకు నేర్చిన వాడు బొంకులు చెప్తున్నాడురా ..వెనకనుండి ఎవరిదో నవ్వు 

సైలెన్సు ప్లీజ్ ..నువ్వు చెప్పు 

నేను ఒక సాదారణ మద్య తరగతి మనిషిని. పురోహితము చేస్తూ అందరి హితము కోరుకొనే వాడిని 

నాకు మరో వృత్తి తెలియదు .నన్ను నమ్మి నా బార్య నన్ను పెళ్ళాడి వచ్చింది. 

నేను ఏ రోజు ఆమెను ఇబ్బంది పెట్ట లేదు, మాటలతో, చేతలతో గాయ పరచలేదు ,అలాగని  ఆమెకు అందమైన సుఖమైన జీవితము నేను ఇవ్వలేదు .కేవలం ఇద్దరి పిల్లలు నేనే ఆమె సౌబాగ్యం సంపద అనుకోని నేను ఇచ్చినది కట్టుకొని నేను పెట్టినది తిని నాతో 30 ఏళ్ళు కాపురము చేసింది .

ఎ రోజు తన జీవితము తనకి అసంతృప్తి గ వుంది అని చెప్పలేదు ,తనంలో తాను బాద పద లేదు. 

నా పిల్లలకు నాలా పేద  జీవితము రాకూడ దని వారిని పెద్ద చదువులు చదివించడానికి మేమిద్దరమూ మా సంతోషము సరదాలు చంపుకొని ప్రతి పైసా వారి కోసమే కర్చు పెట్టాము .

మండపముపంచలతో నేను ,దానము ఇచ్చిన చీరలతో నా బార్య కట్టుకొని,పిల్లలలకు మంచి బట్టలు కొని పెట్టేవాల్లము 

మండపము బియ్యము తో మేము కాలము గడుపుతూ వారికి ఏ  లోటు లేకుండా పెంచాము

మా 30 వైవాహిక జీవితములో ఏరోజు ఆమెకు అనా బంగారము గాని మంచి చీర గాని నేను కోన లేదు ఆమె అడగ లేదు. 

మా పిల్లలు వారు కోరుకున్న చదువులు చదవడానికి ,గొప్పగా జీవించడానికి మా సర్వస్వం అమ్ముకున్నాము.

నా తండ్రి ఇచ్చిన ఇల్లు కూడా ఆకరికి అమ్ముకున్నాము. 

ఈ రోజున ఈ భూమి మీద మాకు అంటూ ఎక్కడ అడుగు స్థలము కూడా నిల్చున్డుకి కూడా లేదు 

అలాగని ఏరోజు  మేము అందుకు బాద పడలేదు

పిల్లలు స్తిరపడితే వారితో కలసి బతకడమే పెద్ద ఆస్తి అనుకున్నాము.

వాళ్ళకి ఉద్యోగాలు వచ్హాయి. సమాజము లో గొప్పగా ఎదిగారు .

వారు కోరుకున్న వాళ్ళతోనే వాళ్లకు వివాహము చేసాము 

వాళ్ళ ఆనందమే మా ఆనందము అనుకున్నాము 

కాని ...

ఏ రోజున మేము వాళ్ళ దృష్టిలో వారి అత్త్హవారి దృష్టిలో లేకివాల్లము ఏమి లేని వాళ్లము అయ్యాము 

నా బార్య ఏ పరిణామాలకు  తట్టుకోలేక పోయింది 

అనారోగ్యమ పాలయ్యింది .

అయ్యా  అమ్మ కాళ్ళకి కొడుకు  నూనె రాస్తే    తప్పా.ఆడదాన్ని కాళ్ళు మగాళ్ళు పట్టుకోవటం 

ఏమిటి చందాలముగా అని మా కోడలు అనేది 

మా అమ్మ అంటే నాకు ఇష్టము .ఆమెకు నేను ఏ సేవ చేయలేదు .పోనీ నాపిల్లల కడుపునా మా అమ్మ పుడుతుంది ఆమెకు ఆడిస్తూ పాడిస్తూ తినిపిస్తూ గారాబముగా చూసుకోవాలని అనుకున్నాను .కాని

మా మనవాళ్ళను మా దగ్గరికి రాకుండగా చేసారు,మేమంటే అసయ్యము కలిగే లా మా మీద చాడీలు చెప్పారు 

మేము  తిండి కోసమో,బట్ట కోసమో వాళ్ళ తో వుండాలని అనుకోలేదు

ఆపయాత, అభిమానము కోరుకున్నాము

కాని వారి హై క్లాసు సొసైటీ లో మేము చీడపురుగుల్ల కనపడ్డాము 

చాలామందికి మమ్మలిని దూరపు బండువులుగా చెప్పారు 

ఎలా రెండుపూటలా తింటూ కూర్చుంటే మీరు ఎప్పుడు చస్తారని రోజు కోడళ్ళు నీచముగా తిట్టే వారు .

ఇలా వాళ్ళ మీద పడి బతికే కంటే  ఏ ట్రైన్ కిందో పది చావచ్చు కదా అని ఈసడించుకొనే వారు .

కోడళ్ళ మాటలకు పౌరషము వచ్చో ,పంతమో వచ్చో మేము బయటకి పోవాలని వాళ్ళ  ఆలోచన .

నేను నా బార్యకి పెళ్లి అయింది మొదలు ఏది గొప్ప జీవితము  ఇవ్వలేదు 

ఇప్పుడు కూడా ఏ వయస్సులో  ఆమెకు ఈ నరకము నాకు నచ్చలేదు .

ఒక్క క్షణము చెప్పటము ఆపి చుట్టూ చూసాను.

ఎందరు నమ్మారో ఎందరు నమ్మట లేదో గాని అందరు నిస్సబ్దముగా వింటున్నారు 

నా బార్య అమాయకురాలు .నేను తప్ప తనకి మరో లోకము తెలియదు .ఒక వేల నేను గాని ముందు పోతే నేను లేని ఈ లోకములో తను ఒక్క క్షణము కూడా బ్రతకలేదు అందుకని,......

అందుకని ముందే ఆమెని చంపెసావా?జడ్జి గారి సూటి ప్రశ్న.

లేదు సార్ నేను లేకుండా ఆమె ఎలా వుండలేదో ఆమె లేకుండా నేను బ్రతకలేను 

మరి ఎందుకు చేసావు ఈ పని 

నేను ఆరునెలల కన్నా బ్రతకును అని ఏదో మాయ రోగము వచ్చిందని డాక్టర్ చెప్పారు .నేను లేని ఆమె జీవితము ఊహించుకోలేక, పిల్లల తీరు చూసాక నేనే ఆమెను చంపేసాను .

మీరు నాకు ఏ శిక్ష వేసిన వేయకపోయినా నేను ఎక్కువ కాలము బ్రతకను 

కాని ఇప్పుడు కూడా ఒక సత్యము చెప్తాను నా బార్య చనిపోయాక ఆమె శరీరములో బాగములు 

అంటే కళ్ళు వంటివి అమ్ముకోవాలని నా పిల్లలు ప్రయత్నించారు .అప్పుడే  ఇదిసహజమరణము కాదని హత్యా అని డాక్టర్స్ చెప్పారు 

నా బార్య చావుకి నేనా కారకుడిని? లేక ఏ బందము బాధ్యతలేని నా పిల్లల?

సర్ మీరు పిల్లలని కనే వుంటారు మీ రేపటి కొడుకులు చేతి లో మోసపోకుండా జగ్రత్హ పదండి.